భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు.... రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం...?

Reddy P Rajasekhar

చైనా భారత్ మధ్య ఏం జరుగుతోంది...? ఇరు దేశాలు చర్చలు అని చెబుతున్న సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏంటి....? 20 మంది జవాన్లు చనిపోవడం ఏమిటి...? ఈ ప్రశ్నలు దేశం మొత్తాన్ని వేధిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, కొందరు అధికారులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. 
 
సోమవారం రాత్రి జరిగిన దాడుల్లో ఇప్పటికే 20 మంది సైనికులు చనిపోగా మరో నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని సమాచారం. రక్షణ శాఖ సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసింది. చైనా విషయంలో భారత్ ఏ విధంగా వ్యవహరించబోతుందనే విషయం గురించి ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: