యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా ట్రైలర్..?
ఇప్పటివరకు తమిళ కన్నడ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నది కీర్తి సురేష్. తెలుగులో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో తనలోని నటిని అందరికీ నిరూపించిన విషయం తెలిసిందే .
తాజాగా కీర్తి సురేష్ పెంగ్విన్ అనే సినిమాలో నటిస్తోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక కుర్రాడికి తల్లి పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిన విషయం తెలిసిందే. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అయితే తాజాగా కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియా లో ఏకంగా 30 మిలియన్ వ్యూస్ సంపాదించాడు. ఇక దీనిపై స్పందించిన కీర్తి సురేష్ ఇంత గొప్ప రెస్పాండ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
30 M + views for #Penguin!
Thank you for the amazing response. I am truly grateful for all the love ❤️#PenguinOnPrime @PrimeVideoIN @EashvarKarthic @karthiksubbaraj @Music_Santhosh @KharthikD @Anilkrish88 @SaktheeArtDir @StonebenchFilms @PassionStudios_ @kaarthekeyens pic.twitter.com/Y8HSM3XBqa — Keerthy suresh (@KeerthyOfficial) June 15, 2020