సుశాంత్ ని మరిచిపోవులేను.. ఆలోచించటం ఆపలేను : షేన్ వాట్సాన్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం ఇప్పటికి కూడా అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం తెలిసిందే.స్వయం కృషితో బుల్లితెర నుంచి వెండివరకు వెళ్లి... అక్కడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని... హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వెనక కారణం ఏమై ఉంటుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి షేన్ వాట్సన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఆలోచించడం ఆపలేదు. ఇది చాలా విచారకరమైనది. ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ లో సుశాంతా లేదా ఎంఎస్డి కాదా అని మీరు మర్చిపోయారు అంటూ షేన్ వాట్సాప్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.