కరోనా నుండి కాపాడాలంటూ ఎమ్మెల్యే దీక్ష..?

praveen

కరోనా  వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలు విధిస్తు ప్రజలందరికీ పలు సూచనలు సలహాలు ఇస్తూ మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండాలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఎంతోమంది ఈ మహమ్మారి వైరస్ విపత్తును  తొలగించాలని దేవుని ప్రార్థిస్తున్నారు. 

 


 తాజాగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కరోనా  విపత్తు నుంచి అందరిని కాపాడాలి అంటూ ఏకంగా దేవుడిపైనే భారం పెట్టేసాడు. తాజాగా దీక్ష చేపట్టి హోమం  నిర్వహించాడు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈరోజు ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో... ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు శ్రీ మహా మృత్యుంజయ పాశుపత సహిత శ్రీ ధన్వంతరి హోమం చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: