
బ్రేకింగ్ : విజయవాడ పోలీస్ కమిషనర్ గా ద్వారకా తిరుమలరావు బదిలీ...?
రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు తాజాగా రైల్వే డీజీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో అదనపు సీపీగా పని చేస్తున్న బి శ్రీనివాసులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన బత్తిన శ్రీనివాసులు 1988 బ్యాచ్ కు చెందిన అధికారి.
గ్రూప్ 1 అధికారిగా పోలీస్ శాఖలో ప్రవేశించి పదోన్నతిపై వివిధ బాధ్యతలను నిర్వర్తించారు. నల్గొండ, తూర్పు గోదావరి జిల్లాల ఎస్పీగా ఆయన పని చేశారు. 2013లో హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఐజీగా బాధ్యతలు నిర్వరిస్తూ దాదాపు 15 నెలలు పని చేశారు. ఆ తర్వాత ఎస్.ఐ.బీ డిజీగా పని చేశారు.