బ్రేకింగ్ : మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చకు సిద్ధం... చంద్రబాబుకు పేర్ని నాని సవాల్...?

Reddy P Rajasekhar

వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ మోదీ కంటే నేనే సీనియర్ అంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శలు చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నామంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారని... మీడియా ముందు ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని తెలిపారు. డబ్బుల కోసం ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో దిగజారారో ఆధారాలు ఉన్నాయని అన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలను జేసీ ఉల్లంఘించారని వ్యాఖ్యలు చేశారు. 
 
కాసుల కోసం జేసీ కకృత్తి పడ్డారని..... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. జేసీ అక్రమాలపై పక్కా సాక్ష్యాలున్నాయని చెప్పారు. అశోక్ లేలాండ్ దగ్గర మిగిలిపోయిన బీఎస్ లారీ ఛాసిస్ లను జేసీ కొన్నారని.... కోహిమా రిజిస్ట్రేషన్ తో కొని వాహనాలను ఏపీకి తెచ్చారని... తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని పేర్ని నాని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: