తెలంగాణలోకి అడుగు పెట్టిన రుతు పవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కోస్తా ఆంద్ర రాయలసీమ జిల్లాల్లో మోహరించిన రుతు పవనాలు ఇప్పుడు తెలంగాణా అంతటా వ్యాపిస్తున్నాయి. దీనితో రాబోయే 4 గంటల్లో తెలంగాణా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇక ఏపీలో గత 24 గంటల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక మరి కొన్ని చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో కోస్తాంద్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా తెలంగాణాలోని ఉమ్మడి ఖమ్మం తో పాటుగా నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.