రానా మిహీకా వివాహ తేదీ ఫిక్స్... పెళ్లి ఎప్పుడంటే...?
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో రానా తాను మిహీకాతో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత త్వరలోనే రానా మిహీకా వివాహం జరగనుందని దగ్గుబాటి సురేష్ కూడా ప్రకటించారు. తాజాగా వీరి పెళ్లి తేదీ కన్ఫామ్ అయింది. ఆగస్టు నెల 8వ తేదీన వీరి వివాహం జరగనుంది. దగ్గుబాటి, మిహీకా కుటుంబాల నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడింది.
హైదరాబాద్ లోనే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. మూడు రోజుల పాటు పెళ్లి తంతును నిర్వహించబోతున్నారని సమాచారం. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకలను నిర్వహించబోతున్నారని... కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. నిశ్చితార్థం నిర్వహించకుండా నేరుగా పెళ్లి చేయబోతూ ఉండటం గమనార్హం.