వలస కూలీలకు సుప్రీం కోర్టు శుభవార్త... ఆ కేసులు ఎత్తేయాలని ఆదేశాలు...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ విజృంభించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడింది వలస కార్మికులే. వీరి కష్టాలు సుప్రీం కోర్టు వరకు చేరాయి. కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు 15 రోజుల్లోగా వలస కార్మికులను స్వస్థలాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు సుప్రీం కోర్టు వలస కూలీలకు సంబంధించిన తుది ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వలస కూలీల తరలింపు ప్రక్రియను 15 రోజుల్లోగా రాష్ట్రాలు పూర్తి చేయాలని మళ్లీ కోర్టు ఆదేశించింది. 
 
24 గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా వలస కూలీలపై నమోదైన లాక్ డౌన్ ఉల్లంఘన కేసులను ఎత్తేయాలని ఆదేశాలు జారీ చేసింది. వలస కూలీల జీవనోపాధి కోసం పలు పథకాలకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రూపకల్పన చేయాలని సుప్రీం సూచించింది. వలస కూలీల నమోదు, గుర్తింపు ప్రక్రియను ప్రతీ రాష్ట్రం పూర్తిచేయాలని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: