చనిపోయిన కరోనా రోగి పట్ల అమానుషం... శవాన్ని గొయ్యిలోకి విసిరేసి...?
దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా రోగుల అంత్యక్రియలను అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వైద్య సిబ్బంది అంబులెన్స్ నుంచి కరోనా రోగిని కొందకు తీసి శవాన్ని గొయ్యిలోకి విసిరేశారు.
చనిపోయిన వ్యక్తిని కేవలం తెల్లని వస్త్రంతో చుట్టి ఉంచి వైద్య సిబ్బంది ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించారు. శవంపై తెల్లటి వస్త్రాన్ని కూడా సరిగ్గా కప్పలేదు. మృతదేహం విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మృతదేహాన్ని సిబ్బంది సరిగ్గా పూడ్చారా...? లేదా...? తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో సీఎం విచారణకు ఆదేశించారు.