పదో తరగతి పరీక్షలపై వీడిన ఉత్కంఠ... జీ.హెచ్.ఎం.సీ పరిధిలో పరీక్షలు వాయిదా...?
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. జీ.హెచ్.ఎం.సీ పరిధిలో, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీ.హెచ్.ఎం.సీ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండటంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే తరగతి గదికి విద్యార్థులను కేటాయించింది.