చీపురు పట్టిన కండల వీరుడు.. పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యానికి రక్ష!

Edari Rama Krishna

భారత దేశంలో ఫిబ్రవరి నుంచి మొదలైన కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దాంతో సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడింది. ఇక సెలబ్రెటీలు అందరూ ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌజ్ లో గడుపుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున మోదీ త‌ల‌పెట్టిన స్వ‌చ్ భార‌త్‌ని ప్ర‌మోట్ చేస్తూ వీడియో షేర్ చేశాడు. మను చుట్టు వాతావరణం పరిశుభ్రంగా ఉంటే.. ఎలాంటి వైరస్ భారిన పడే అవకాశం ఉండదని అంటున్నారు సల్మాన్. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాలి.

ఇంటి ప‌రిస‌రాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రప‌ర‌చుకోవాలి అని జ‌నాల‌లో చైత‌న్యం క‌లిగేలా స్వ‌యంగా   చీపురు ప‌ట్టి గార్డెన్‌ని క్లీన్ చేశారు స‌ల్మాన్ ఖాన్.  స‌ల్మాన్‌తో పాటు లులియా వాంట‌ర్ మ‌రి కొద్ది మంది స‌న్నిహితులు క్లీనింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  ఇక తాను శుభ్రం చేస్తు ఆ వీడియో  స‌ల్మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే స‌ల్లూ భాయ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో విరాళాలు అందించ‌డంతో పాటు పేదవారికి నిత్యావ‌స‌ర వ‌స్తువులు కూడా అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: