నా కూతురిని చూస్తే గర్వంగా ఉంది : డైరెక్టర్ మారుతి
ప్రముఖ దర్శకుడు మారుతికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.కాగా సినీ ప్రముఖులు ఎవరైనా తమ కుటుంబానికి సంబంధించి ఏదైనా విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అంటే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి తన కూతురుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తన కూతురు హియ ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పారు డైరెక్టర్ మారుతి. జాన్ వీక్ డీవోపీ డాన్ లాస్టన్ తన కూతురు ఫోటోగ్రఫీ ఇంస్టాగ్రామ్ లో లైక్ చేసారు... మెచ్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు.... తన సెల్ఫోన్ లైట్ తో తన కూతురు ఒక ఫోటోని తీసిందని... ఈ ఫోటోని డాన్ లాస్టిన్ కి నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. నా కూతురు ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది అంటూ దర్శకుడు మారుతి తెలిపారు.