
పదో తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ సర్కార్ మొగ్గు... కంటైన్మెంట్ జోన్ల విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...?
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కోర్టుకు నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించటానికే మొగ్గు చూపింది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. కంటన్మెంట్ జోన్లలోని విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణకు సిద్ధమని ప్రభుత్వం నివేదికను రూపొందించి ఆ నివేదికనే హైకోర్టుకు ఇచ్చింది.
గతంలో పదో తరగతి పరీక్షల విషయంలో సమీక్ష జరిపి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జూన్ 8 నుంచి పరీక్షలు జరగనుండగా వారం ముందు నుంచే వసతి గృహాలకు విద్యార్థులను అనుమతించనున్నట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. జూన్ 8 నుంచి జూలై 5 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9. 30 నుంచి 12.15 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలుస్తోంది.