ప్రాణం తీసిన లాక్ డౌన్... కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లికి అప్పు దొరకకపోవడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం రెవెన్యూ పరిధిలోని చిల్కోయలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చిల్కోయలపాడులో నివశించే నాగటి అప్పయ్య(40), దేవి దంపతులది పేద కుటుంబం. అప్పయ్య ఒక ఇంట్లో జీతానికి పని చేస్తుండగా దేవి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.
 
ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడితో ఈ నెల 14వ తేదీన పెద్ద కుమార్తెకు వివాహం జరిపించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి సరిపడా డబ్బు లేకపోవడంతో అప్పయ్య అప్పు కోసం ప్రయత్నించాడు. ఎవరిని డబ్బు అడిగినా లాక్‌డౌన్ కారణంగా తామే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వారు చెప్పడంతో అప్పు దొరక్క అప్పయ్య సోమవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అప్పయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అప్పయ్య మృతి చెందాడు. లాక్ డౌన్ పరోక్షంగా అప్పయ్య ప్రాణాలు పోవడానికి కారణమైందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: