టాలీవుడ్ చరిత్రలో కృష్ణకు మాత్రమే సొంతమైన రికార్డులు ఇవే...?

Reddy P Rajasekhar

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న వారిలో కృష్ణ ఒకరు. దాదాపు 340 సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతమైన ఎన్నో ఉన్నాయి. కృష్ణ 24 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారు. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా 56 దేశాల్లో విడుదలైన తొలి సినిమాగా రికార్డులకెక్కింది. 
 
ట్రెజర్ హంట్ పేరుతో ఈ సినిమా హాలీవుడ్ లో కూడా కూడా విడుదలైంది. ఈ సినిమా భారతీయ సినిమా నుండి హాలీవుడ్ కు డబ్ అయిన తొలి సినిమాగా నిలిచింది. కృష్ణ నటించిన సినిమాలు ఫస్ట్ సినిమా స్కోప్, ఫస్ట్ 70 ఎం.ఎం, ఫస్ట్ సిక్స్ ట్రాక్ ఆడియో సిస్టమ్, ఫస్ట్ సోషల్ కలర్ ఫిల్మ్, ఫస్ట్ స్కోప్ టెక్నో విజన్ ఫిల్మ్, ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ లాంటి అరుదైన ఘనతలను దక్కించుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: