జగన్ అనే నేను @1 : అమ్మ ఆశయం నెరవేరిన రోజు

praveen

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ఒక తల్లి కల నెరవేరిన రోజు... తండ్రి ఆశయాన్ని తనయుడు నిలబెట్టిన రోజు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి గా దొరికిన రోజు. ఇదే రోజు జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన ప్రారంభమైన రోజు. తండ్రిలాగే తాను కూడా ఒక జననేతను అని సంవత్సర కాలంలోనే నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

తమ  ప్రభుత్వం పూర్తిగా ప్రజాహితం అని నిరూపించారు జగన్ మోహన్ రెడ్డి. తన తల్లి కళలను నెరవేర్చి విజయం అందించారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుంచీ ఎన్నో కష్టాలు... ఎన్నో ఇబ్బందులు... అడుగడుగునా అధికార పార్టీ నుంచి విమర్శలు... అన్నింటినీ తట్టుకుని తనయున్ని  ముందుకు నడిపిస్తూ తనయుడు వెన్నుతట్టింది  జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ. తనయుడు విజయమే  తన విజయం అనుకుని ఎన్నో కష్టనష్టాలకు ఎదురెళ్ళింది . చివరికి  సరిగ్గా ఇదే రోజు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆ తల్లి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: