అనసూయ లోని ఈ స్కిల్ గురించి మీకు తెలుసా..?
ప్రస్తుతం బుల్లితెరపై షూటింగులు అటు వెండి తెరపై షూటింగ్ లు ఆగిపోవడంతో ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయంలో సెలబ్రిటీలు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేర్చుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సినీ సెలబ్రిటీలు.
ఈ క్రమంలోనే తాజాగా సినీనటి అనసూయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. నాలోని మేకప్ స్కిల్స్ ని చూపిస్తానంటూ అనసూయ ఒక ఫోటో పోస్ట్ చేసింది. కాగా అనసూయ కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Just showing off my self make up skills 💄👀💁🏻♀️ https://t.co/4iJ2KMbADr — anasuya Bharadwaj (@anusuyakhasba) May 29, 2020