కేటీఆర్ కు క్యూట్ గా కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి... వీడియో వైరల్..?
తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంత చురుకుగా ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుంటాడు. కేటీఆర్ అంత సమర్థవంతుడు కాబట్టి కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పటికీ తర్వాత నెక్స్ట్ సీఎం కేటిఆర్ అని చెప్పకనే చెప్పినప్పటికీ ఎవరి నుంచి కాస్తంత అయినా వ్యతిరేకతా రాలేదు. తెలంగాణ ప్రజానీకం కూడా కేటీఆర్ పని తీరుతో ఎంతో సంతృప్తిగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా కేటిఆర్కు ఒక చిన్నారి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మా దగ్గర వాటర్ ప్రాబ్లమ్ ఉంది అంటూ కేటీఆర్ సార్ రాత్రి మీకు ఫోన్ చేసాము... ఇప్పుడు మా ఏరియా లో వాటర్ ప్రాబ్లమ్ తీరిపోయింది. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. మీరు ఇంత త్వరగా స్పందించి సమస్య తీర్చినందుకు మీకు ధన్యవాదాలు. థాంక్యూ కేటీఆర్ అంకుల్ అంటూ ఓ చిన్నారి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
@KTRTRS @KTRoffice
Thank you Sir for your immediate response and directives for required action. gayatri wants to thank you through this... pic.twitter.com/hWC9iClBZm — Phani Mylavarapu (@kiranmps) May 27, 2020