బ్రేకింగ్: వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు జగన్ నయా ప్లాన్...!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయంను లాభసాటిగా మార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తక్కువ ధరలకే నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు పగటిపూటే ఉచిత కరెంట్ అందజేస్తామని తెలిపారు.
రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని... రాష్ట్రంలో ఏ రైతు కూడా నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ లో మరో 4,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. ఖరీఫ్ నుంచి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని... కరోనా సమయంలో రైతులకు 1300 కోట్ల రూపాయలు సాయం చేశామని తెలిపారు.