సీఎం జగన్ను బండ బూతులు తిట్టాడు.. అయ్యన్న డైరెక్షన్ సుధాకర్ యాక్షన్..?
నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన అనస్థీషియన్ డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ ను తాజాగా ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది . తాజాగా నడి రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన తెలిపిన సుధాకర్.. తనపై పోలీసులు లాఠీచార్జి చేస్తూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆరోపించారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని బండబూతులు తిట్టాడు డాక్టర్ సుధాకర్. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. టిడిపి ముఖ్య నేత అయిన అయ్యన్న డైరెక్షన్ చేస్తుంటే సుధాకర్ యాక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.