
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంచు లక్ష్మి..?
మంచు వారి వారసురాలు లక్ష్మి మంచు ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఓ వైపు నటిగా మరోవైపు హోస్ట్ గా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంది లక్ష్మి మంచు. ఇక తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్టు వైరల్ గా మారిపోయింది. సరిగ్గా 2017 లో ఇదే వారం... మేము తిరుమల కొండపైకి వెళ్ళాము. మేము దీన్ని త్వరలో మళ్లీ చేస్తాము... త్వరలో తిరుమల కొండపైకి వెళ్తాము.. గోవిందా గోవిందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This week in 2017. On our way up Tirumala. We shall do this soon again! govinda goooovinda 🙏🏽🙏🏽🙏🏽 @Rakulpreet @AndySrinivasan pic.twitter.com/cs6rHujkRy — lakshmi Manchu (@LakshmiManchu) May 5, 2020