నిమ్మగడ్డ లీగల్ ఫైట్ లో భారీ ట్విస్ట్... ఇరకాటంలో జగన్ సర్కార్... విచారణ రేపటికి వాయిదా...?
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ ను ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే నిమ్మగడ్డ తొలగింపు సరైన నిర్ణయం కాదంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది. రాష్ట్రంలో జిల్లా పరిషత్ పంచాయతీలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సైతం నోటిఫికేషన్లు విడుదలయ్యాయని... నాడు ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ఉన్నారని... కరోనా వల్ల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలు ఒకరకంగా జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టేవే అని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను తొలగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ ఇప్పటివరకు 11 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈరోజు కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వాదనలకు వ్యతిరేకంగా ఉన్నాయని నిమ్మగడ్డ తరపు లాయర్లు చెబుతున్నారు. ప్రభుత్వం వాదన సమంజసంగా లేదని నిమ్మగడ్డ తరపు లాయర్లు వాదించారు. ప్రస్తుత కమిషనర్ పదవీకాలం ముగిసిన తర్వాత మాత్రమే అర్హతలు, విధానాలు మార్చుకోవాలని వాదనలు వినిపించారు. కాగా రేపటి విచారణలో మరికొంతమంది పిటిషనర్ల వాదనలను హైకోర్టు విననుంది.