ఇర్ఫాన్ ఖాన్‌తో అనుబంధం గుర్తు చేసుకున్న టాలీవుడ్ అగ్ర నిర్మాత..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేటి క్రితమే మరణించారు. ఆయన వయసు 54. మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. రీసెంట్‌గా ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. ఇక ఆయన తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో 2006లో వచ్చిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించారు. ఈ క్రమంలోనే ఇర్ఫాన్ మృతిపై వైజయంతీ మూవీస్ ట్విట్టర్ వేదికగా తమ సంతాపం వ్యక్తం చేసింది. మా బ్యానర్లో వచ్చిన సినిమాలో మంచి క్యారెక్టర్లో నటించారని టీం ఇర్ఫాన్‌ను అనుభవాలను గుర్తు చేసుకున్నారు.