అందాల రాక్షసికి అందని ద్రాక్ష !

Vimalatha
టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈరోజు అంటే డిసెంబర్ 15న తన 31వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. లావణ్య తండ్రి లాయర్ కాగా, తల్లి టీచర్ వృత్తి చేపట్టారు. లావణ్య త్రిపాఠి విద్యాభ్యాసం మొత్తం డెహ్రాడూన్ లోనే సాగింది. లావణ్య త్రిపాఠి డిగ్రీని ముంబయ్ లోని రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో పూర్తి చేశారు. కాలేజ్ సమయంలోనే లావణ్య ఈ షోబిజ్ ప్రపంచంలో అడుగు పెట్టాలని కలలు కనేది. అందుకోసం భరత నాట్యంలో శిక్షణ పొంది, పలు ప్రదర్శనలు ఇచ్చేది. ఈ ప్రదర్శనల ఫలితంగా ఆమెకు ముందుగా ఆమె టీవీ పరిశ్రమలో స్స్ష్హ్...కోయ్ హై, ప్యార్ కా బంధన్, CID వంటి సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది.
తరువాత మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2012లో 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టింది. చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన తర్వాత వరుస అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. అయితే ఎంత చేసినా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది తప్పితే స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందని ద్రాక్షే అయ్యింది. బ్రమ్మన్, మాయవాన్ అనే తమిళ చిత్రాల్లోనూ నటించింది.  .
ఇక తెలుగులో ఈ బ్యూటీ దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు , ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, లచ్చిమిదేవికో లెక్కుంది, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ప్రెస్, చావుకబురు చల్లగా వంటి చిత్రాల్లో నటించింది అందులో ఆమె భలే భలే మగాడివోయ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. నానితో ఆమె జోడి భలే కుదిరింది. అయితే ఈ బ్యూటీ ఒక్క నాగార్జునతో తప్ప టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో జత కట్టలేకపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: