వైవిధ్యానికి మారు పేరు వెంకటేష్

Vimalatha
కమర్షియల్ లేదా స్టార్ హీరో అనే చిత్రంలో చిక్కుకోకుండా వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ, వైవిధ్యానికి వారధిగా టాలీవుడ్ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ సాధించిన విజయాలు ఎన్నో. సమయానుసారంగా తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు హీరోలకు పోటీ చేస్తూ ఇప్పటికీ వైవిధ్యతను చాటుకుంటున్నాడు వెంకటేష్. వయసుకు తగ్గ పాత్రలతో వినోదాన్ని పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. టాలీవుడ్ దివంగత బడా నిర్మాత డి.రామానాయుడు తనయుడు 1960 డిసెంబర్ 13న ఆయన రెండో కొడుకుగా జన్మించాడు. అప్పటికే తండ్రి నిర్మాత కావడంతో వెంకటేష్ కు సినిమాల పై మక్కువ ఏర్పడింది. తండ్రి నిర్మించిన ప్రేమనగర్ చిత్రం లో వెంకటేష్ బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1986లో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ హీరోగా పరిచయమయ్యాడు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా లభించకపోయినా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మపుత్రుడు చిత్రం పర్వాలేదనిపించింది. చిరంజీవి బాలకృష్ణ కలిసి కనిపించిన ఏకైక చిత్రం త్రిమూర్తులు. నసీబ్ అనే హిందీ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించాడు. టి సుబ్బిరామి రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ఇదే సీన్ లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి సీనియర్ హీరోలు కూడా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక 1988 లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు వెంకటేష్. చిత్ర పరిశ్రమలు అదే ఆయనకు మొదటి అవార్డు. ఆ తర్వాత గణేష్, కలిసుందాం రా చిత్రాలకు నంది అవార్డులను అందుకున్నారు. 2007లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలోనూ ఉత్తమ నటునిగా మరోసారి నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇలా మొత్తం ఐదు సార్లు ఉత్తమ నటుడిగా నిలిచిన ఏకైక స్టార్ హీరోలు వెంకటేష్.
ఇక చంటి చిత్రం ఘనవిజయం సాధించడంతో వరుసగా చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు చిత్రాలతో వెంకటేష్ అలరించారు. ఇక ఇప్పటికీ వెంకటేష్ ను తలచుకుంటే గుర్తొచ్చే మూవీస్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం, రాజా.. ఇవి కూడా రీమేక్ చిత్రం అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వెంకటేష్ జెమినీ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లి, బాడీగార్డ్, మసాలా, దృశ్యం, గోపాల గోపాల, గురు చిత్రాలు రీమేక్స్ అయ్యాయి. ప్రస్తుతం వెంకటేష్ రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అలాగే ఎఫ్ 3 అనే కామెడీ పూలతోను అలరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: