16 ఏళ్ల వయసులోనే డేటింగ్... కార్తీక్ ఆర్యన్ సాహసం

Vimalatha
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన గోవా ట్రిప్ ఫోటోలను షేర్ చేయగా అవి ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. ఆయన పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా కార్తీక్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ కార్తీక్ ఆర్యన్ ఈరోజు తన 31వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మిగతా నటీనటుల కంటే కార్తీక్ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ నటుడు కామెడీ, రొమాంటిక్ హీరోల శైలిలో పాపులర్ అయ్యాడు.
కార్తీక్ 22 నవంబర్ 1990న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించాడు. అతను గ్వాలియర్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ చదవడానికి ముంబైకి వచ్చాడు. కాలేజీ సమయంలోనే కార్తీక్ కాలేజీతో పాటు మోడలింగ్ చేసేవాడు. ఈ సందర్భంగా నిర్మాత కుమార్ మంగత్, దర్శకుడు లవ్ రంజన్‌లను కలిశారు. లవ్ రంజన్ ఆయనను 'ప్యార్ కా పంచనామా' సినిమాలో నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 'ఆకాష్ వాణి', 'కాంచి' చిత్రాల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. అందుకే పెద్దగా హిట్ అవ్వలేదు. దీని తర్వాత కార్తీక్ లవ్ రంజన్ చిత్రం 'ప్యార్ కా పంచ్‌నామా 2'లో కనిపించాడు. ఆయన సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత చేసిన 'సోను కే టిటు కి స్వీటీ'లో కనిపించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక కార్తీక్ చేసిన 'లుకా చుప్పి', 'పతి పత్నీ ఔర్ వో' వంటి చిత్రాలతోనూ బాలీవుడ్ లో మ్యాజిక్ క్రియేట్ చేశాడు.
'ది కపిల్ శర్మ షో'లో 'లవ్ ఆజ్ కల్ 2' ప్రమోషన్ సందర్భంగా కార్తీక్ తన మొదటి స్నేహితురాలితో 16 ఏళ్ల వయస్సులో వెళ్లినట్టు, ఆ సమయంలో తనను ఎవరూ చూడకూడదని భయపడ్డానని చెప్పాడు. కాగా కార్తీక్ హీరోగా ఇటీవల విడుదలైన 'ధమాకా' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అలాగే 'ధమాకా'లో ఆయన నటన అందరి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కార్తీక్ 'భూల్ భూలయ్యా 2', 'షెహజాదా' మరియు 'ఫ్రెడ్డీ' వంటి చిత్రాలలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: