ఒక్క ఫోటో కారణంగా మిలింద్ 14 ఏళ్ళ న్యాయపోరాటం !

Vimalatha
మిలింద్ సోమన్ అంటే తెలియని ఫిట్నెస్ ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ ఫిట్నెస్ ఫ్రీక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ప్రతిరోజూ తన ఫోటోలను పంచుకుంటాడు. ఈరోజు మిలింద్ తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతను 4 నవంబర్ 1965న యూకే లో జన్మించాడు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఈరోజు మిలింద్ పుట్టినరోజు సందర్భంగా అతని గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
మిలింద్ సోమన్ 1995 సంవత్సరంలో న్యూడ్ ఫోటో షూట్ చేసాడు. ఆ ఫోటో షూట్ కారణంగా తర్వాత వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఫోటోషూట్‌లో మిలింద్‌తో కలసి అలనాటి ప్రముఖ మోడల్ మధు సప్రే కనిపించారు. ఈ ఇద్దరు సూపర్ మోడల్‌ల బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మిలింద్‌కి సంబంధించిన ఈ ఫోటో షూట్‌ పై చాలా రచ్చ జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఫోటోపై మిలింద్ సోమన్ 14 ఏళ్ల న్యాయ పోరాటం చేశారు. ఆ తర్వాత కోర్టు యాడ్ కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.
మ్యూజిక్ వీడియోలో కన్పించారు
మిలింద్ సోమన్ 1995 సంవత్సరం లోనే అలీషా చినోయ్ సూపర్ హిట్ ఆల్బమ్ 'మేడ్ ఇన్ ఇండియా'లో కనిపించాడు. ఈ ఆల్బమ్ తర్వాత మిలింద్ పేరు మారుమ్రోగిపోయింది.
మొదటి యాడ్ కు సంపాదన ఎంతంటే ?
మిలింద్ సోమన్ కొంతకాలం క్రితం తన మొదటి ఫోటోషూట్ కు చిత్రాన్ని పంచుకున్నాడు. దీని కోసం తనకు 50 వేల రూపాయలు లభించాయని చెప్పాడు. ఫోటోను పంచుకుంటూ "1989 సంవత్సరంలో మొదటి ఎడిషన్. కొన్ని గంటల ఫోటోషూట్ కోసం 50 వేలు ఆఫర్ చూసి  నేను ఆశ్చర్యపోయాను. ఈ వ్యక్తులకు పిచ్చి పట్టిందని నేను అనుకున్నాను. అప్పటికి నాకు 23 సంవత్సరాలు. నేను వంటవాడిగా నా వృత్తిని ప్రారంభించాను" అని ఆయన చెప్పుకొచ్చారు.
25 ఏళ్ల చిన్న అమ్మాయితో పెళ్ళి
మిలింద్ తన కంటే 25 ఏళ్ల చిన్న అమ్మాయిని 2018లో పెళ్లి చేసుకున్నాడు. మిలింద్, అంకిత 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హెడ్‌లైన్స్‌లో భాగమయ్యాడు. మిలింద్, అంకిత ఇద్దరూ ఫిట్‌నెస్ ఫ్రీక్స్. సోషల్ మీడియాలో కలిసి ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: