తన నటనతో మాత్రమే కాకుండా అందంతోనూ అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటీమణులలో
ఇలియానా డిక్రూజ్ ఒకరు.
ఇలియానా చాలాసార్లు బాడీ షేమింగ్‌కు గురైనప్పటికీ ఆమె ప్రతిభావంతులైన, అందమైన నటీమణులలో ఒకరు.
గోవా బ్యూటీ
ఇలియానా నవంబర్ 1న తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
ముంబై లో పుట్టిన
ఇలియానా గోవా లో పెరిగింది. చిన్నవయసులోనే మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసిన
ఇలియానా అనేక బ్రాండ్లకు సంబంధించిన యాడ్లలో నటించింది. ఆ తర్వాత 2006లో
ఇలియానా దేవదాసు చిత్రం ద్వారా వెండితెర అరంగ్రేటం చేసింది. ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన సూపర్ హిట్
మూవీ లో నటించిన ఆమె "కేడి" చిత్రం తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సౌత్ లో టాప్
హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే
ఇలియానా బర్ఫీ చిత్రంతో
హిందీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012 లో విడుదలైన ఈ చిత్రం రన్బీర్ కపూర్
ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి గాను ఆమె ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు ను కూడా అందుకుంది. అదే సంవత్సరం
ఇలియానా వరుణ్
ధావన్ సరసన 'మెయిన్ తెర హీరో' చిత్రంలో కనిపించింది.
సైఫ్ అలీఖాన్ తో 'హ్యాపీ వెడ్డింగ్' కథ చిత్రం లోని నటించింది. తనకి టాలీవుడ్లో మర్చిపోయి అక్కడే స్థిరపడి పోయింది. అలా 2006లో
సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసిన
ఇలియానా ఆ తరువాత
ఇండస్ట్రీ లో స్టార్
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ మంచి
జోష్ లో ఉండగానే ఈ నటి ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. చాలా ఏళ్లు కలిసి ఉన్న తర్వాత వారిద్దరూ సడన్‌గా విడిపోయారు. అప్పటి నుంచి
ఇలియానా ఒంటరిగానే ఉంది. ఆ తరువాత తెలుగులో
రవితేజ సరసన ఆమె
సినిమా చేసినప్పటికీ అది హిట్ అవ్వలేదు. దీంతో ఆమెకు అవకాశాలు అడుగంటాయి. ప్రస్తుతం ఫోటోషూట్లతో కాలం వెళ్లబుచ్చుతోంది ఈ బ్యూటీ.