హ్యాపీ బర్త్ డే : మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అక్షర హాసన్

Vimalatha
అక్టోబర్ 12న నటి అక్షర హాసన్ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఆమె దక్షిణ సినీ ప్రముఖుడు, లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె. అక్షర హాసన్ బాలీవుడ్ నుండి సౌత్ వరకు అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె కెరీర్ మొదట్లోనే చాలా పెద్ద కళాకారులతో పని చేశారు. పుట్టినరోజు సందర్భంగా అక్షర హాసన్‌కు సంబంధించిన ప్రత్యేక విషయాలను మీ కోసం.
అక్షర హాసన్ 12 అక్టోబర్ 1991 న చెన్నైలో జన్మించారు. ఆమె తమిళనాడు నుండి చదువు పూర్తి చేసింది. బేసిక్ గా సినిమా కుటుంబానికి చెందినదే కనుక మొదటి నుండి నటన వైపు మొగ్గు చూపింది. అక్షర సహాయ దర్శకురాలిగా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె రాహుల్ ఢోలాకియాతో చాలా కాలం పాటు కో-డైరెక్టర్‌గా పని చేశారు. అయితే ఆమె సహాయ దర్శకురాలిగా తన కెరీర్‌లో వచ్చిన అనేక సినిమాల ఆఫర్‌లను తిరస్కరించింది. ఆమె గొప్ప నటి, అలాగే స్క్రీన్ రైటర్ కూడా.
అక్షర హాసన్ బాలీవుడ్, సౌత్ సినిమాకి చెందిన ఇద్దరు ప్రముఖులతో నటిగా అరంగేట్రం చేసింది. అక్షర తొలి చిత్రం 'షమితాబ్'. ఈ చిత్రం 2015 సంవత్సరంలో వచ్చింది. ఈ చిత్రంలో అక్షర హాసన్ తో పాటు అమితాబ్ బచ్చన్, ధనుష్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్షర హాసన్ ఇప్పటివరకు అనేక సౌత్ చిత్రాలలో కూడా కనిపించింది.
2018 సంవత్సరంలో ఆమె వ్యక్తిగత పిక్స్ లీక్ కావడంతో వార్తల్లో నిలిచింది. అక్షర హాసన్ తన ఫోటో లీక్ అయినట్లు స్వయంగా సోషల్ మీడియాలో చెప్పింది. ఈ విషయంలో అక్షర హాసన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి సైబర్ సెల్ నుండి సహాయం కోరింది. పోలీసుల విచారణలో అక్షర కాకుండా ఈ చిత్రాలు ఆమె మాజీ ప్రియుడు తనూజ్ విర్వాణీ దగ్గర కూడా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు చేశారు.
2017 సంవత్సరం ప్రారంభంలో అక్షర మతం మారినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కమల్ హాసన్‌ను ప్రశ్నించినప్పుడు అతను తన కుమార్తె వైపే ఉన్నానని చెప్పాడు. కూతురిపై తనకు ఉన్న ప్రేమ అన్నిటికన్నా గొప్పదని చెప్పాడు. అక్షర బౌద్ధమతం పట్ల ఆసక్తి చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: