మినీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈ మచిలీపట్నం చిన్నోడు

Vimalatha
ఈ మచిలీపట్నం చిన్నోడు మినీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. మారుతి పేరుతో అందరికీ తెలిసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అసలు పేరు మారుతీ దాసరి. టాలీవుడ్ లో డైరెక్టర్ గా కథా రచయితగా నిర్మాతగా సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్పులు చాటుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు.
మారుతి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో 1981 అక్టోబర్ 8న జన్మించారు. అక్కడే తన ప్రాథమిక విద్యతో పాటు సెకండరీ విద్యను కూడా పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చిన యానిమేషన్ నేర్చుకున్నాను. ప్రేమిస్తే, ఫిలిం బై అరవింద్ సినిమా లకు కొత్తగా సినిమా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాలను పంపిణీ చేయడంతో పాటు యాడ్స్ డిజైన్ చేశాడు. బడ్జెట్ తో హిట్ సినిమాలను అందించాలన్న ఆలోచనతో ఈ రోజుల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. 2012 లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. శత రూపొందిన ఈ చిత్రం 10 కోట్లకు పైనే వసూలు చేసింది. 2012 లోనే ఆయన దర్శకత్వం వహించిన రెండో ప్రాజెక్ట్ బస్ స్టాప్ విడుదలై భారీగా హిట్ అయింది. ఇక అప్పటి నుంచి ప్రేమ కథ చిత్రం, మహేష్, విల్లా -2, లవ్ యూ బంగారం, కొత్త జంట, బంగారం,  భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజ రెడ్డి అల్లుడు, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో తన కెరీర్ గ్రాఫ్ ను అమాంతం పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన మంచిరోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... పేదరికంలోనే పుట్టి పెరిగిన ఆయన 2008లో స్పందన అనే అమ్మాయిని పెళ్లి  చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. అలా పేదరికంలో నుంచి బయటకు వచ్చి మట్టిలో మాణిక్యం లా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెరిశాడు మారుతీ. దుస్ట్రీలో డిజిటల్ ట్రెండ్ ను సృష్టించాడు. ఆయన ఇలాగె ముందుకు సాగుతూ ఉండాలని, ఆయన నుంచి మరింత మంది మహానుభావులు, భలే భలే మగాళ్లు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: