సినిమా, రాజకీయ రంగాల్లో వినోద్ ఖన్నా ప్రత్యేక బాణీలు

Vimalatha
విలక్షణ నటుడు వినోద్ ఖన్నా సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలోనూ ప్రత్యేక బాణీలు కల్పించారు. బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వినోద్ ఖన్నా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
వినోద్ ఖన్నా 1946 అక్టోబర్ 6న జన్మించారు. పెషావర్ లో ఆయన పుట్టిన కొన్ని నెలలకే స్వాతంత్రం రావడం, భారత దేశం రెండుగా చీలిపోవడం జరిగిపోయాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన వినోద్ కుటుంబం ముంబైలో స్థిర పడ్డారు. వినోద్ ఖన్నా చదువు ముంబై, ఢిల్లీలో కొనసాగింది. అప్పట్లోనే సినిమాపై ఆసక్తి పెరిగింది. అలాగే క్రికెట్లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. వినోద్ కన్నాను అప్పటి హీరో సునీల్ దత్ నిర్మించిన ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే మొదటి సినిమా 'మన్ కా మీట్' లో ఆయన చేసింది విలన్ పాత్ర. ఈ సినిమాలో యంగ్ విలన్ గా వినోద్ ఆకట్టుకుంది.
ఈ చిత్రం తమిళ మూవీ 'కుమారి పెన్' ఆధారంగా రూపొందింది. అలా మొదటి సినిమా మొదలు కొని వరుసగా మూడు నాలుగు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు వినోద్ ఖన్నా. ఆ తర్వాత హీరోగా మారినా ఆయనకు 'మేరే ఆప్నే' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వినోద్ ఖన్నా సోలో హీరోగా నటించిన చిత్రం 'హమ్ తుమ్ ఔర్ ఓ'కు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో స్థానాన్ని కైవసం చేసుకున్న ఆయన అమితాబచన్ తో పోటీ పడేవారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకానొక ఒక సమయంలో అమితాబ్ కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్న నటుడు వినోద్ ఖన్నా. ఆయన కెరీర్ పిక్స్ లో ఉండగానే 1982లో ఓషో రజనీష్ మార్గంలో నడవడానికి నిర్ణయించుకునే సినిమాలకి వీడ్కోలు పలికారు. అదే సమయం లో అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ ఎదిగిపోయాడు. తర్వాత ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇంతకుముందు ఉన్నంత క్రేజ్ లభించలేదనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరి గురుదాస్పూర్ లోకసభ నియోజకవర్గం నుండి 1997, 99, 2004 అలా మూడు సార్లు గెలుపొందారు. 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికైన హిందీ నటుడిగా చరిత్ర సృష్టించారు. ఆయన మరణానంతరం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: