ఉదయించింది ఉత్తరాదినే... వెలుగులు మాత్రం దక్షిణాదికి..!

Vimalatha
సుందరమైన వదనంతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా నిన్నటి తరం హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగి పోయింది ఖుష్బూ. ఉదయించింది ఉత్తరాదిన అయినా వెలుగులు విరజిమ్మింది మాత్రం దక్షిణాదిన. ఈరోజు ఖుష్బూ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1970 సెప్టెంబర్ 29న జన్మించిన ఖుష్బూ నటి మాత్రమే కాదు రాజకీయవేత్త నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. దక్షిణ చిత్ర సీమలో ఆమె దాదాపు 200 పైగా సినిమాల్లో నటించి 3 తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డులు, కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకుంది. తమిళ చిత్రసీమలో ఆమె చేసిన కృషికిగాను తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'కలైమామణి' అవార్డును ప్రధానం చేసింది.
మహారాష్ట్రలోని ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ఆమె బాలనటిగా కెరీర్ ను ప్రారంభించింది. 1980లో 'ది బర్నింగ్ ట్రైన్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఉత్తరాదిన సినిమాలు చేసిన ఖుష్బూ తెలుగులో వెంకటేష్ సరసన 'కలియుగ పాండవులు' అనే సినిమాతో 1986లో దక్షిణ భారత తెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె చెన్నైకి మకాం మార్చింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ఇతర దక్షిణ భారత చలన చిత్రాల పై దృష్టి పెట్టింది.

దక్షిణాదికి వచ్చాక తర్వాత ఆమె 150 కి పైగా చిత్రాలలో నటించింది. అందులో 100కు పైగా తమిళ చిత్రాలే కావడం విశేషం. ఆమె తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, విజయకాంత్, శరత్ కుమార్, చిరంజీవి, విష్ణువర్ధన్, అంబరీష్, టైగర్ ప్రభాకర్, రవిచంద్రన్, సురేష్ గోపి, సత్యరాజ్, ప్రభు వంటి నటుల సరసన నటించింది. తెలుగులోనూ వెంకటేష్, నాగార్జున సరసన నటించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: