అదృష్టం అంటే ఆమెదే... ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్

Vimalatha
షాలిని పాండే అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది "అర్జున్ రెడ్డి". ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటన యూత్ ని ఎంతగా ప్రభావితం చేసిందో షాలిని పాండే రోల్ కూడా అంతగా ఆకట్టుకుంది. మొదటి సినిమా అయినప్పటికీ ఆమె అందం, అభినయం అమాయకత్వం యూత్ ను పడేసింది. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవడానికి కేవలం అర్జున్ రెడ్డి సరిపోయింది. ఈ చిత్రంలో షాలిని పాత్ర టాలీవుడ్ లో చెరగని ముద్రతో ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా ఆమె అమాయకమైన మొహానికి అందరూ ఫిదా అయ్యారు. ఈ రోజు షాలిని పుట్టిన రోజు.
షాలిని పాండే 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించింది. అక్కడే ఆమె జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. నటనపై మక్కువతో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించింది. అలా థియేటర్ ఆర్టిస్ట్ గా మారిన షాలిని పాండే నటనను ఒక స్టేజ్ షో లో చూసిన "అర్జున్ రెడ్డి" దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమెని తన సినిమాలో హీరోయిన్ గా నిర్ణయించుకున్నాడు. అలా షాలినిని "అర్జున్ రెడ్డి" అవకాశం వరించింది.
ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి దాదాపు 5 నెలలు పట్టింది. అయినప్పటికీ షాలిని పాండే ఓపికగా ఎదురు చూసింది. ఫలితంగా ఆ సినిమా షాలిని ఫేట్ నే మార్చేసింది. ఒకే దెబ్బతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత వరుసగా మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, 100% కాదల్, ఇద్దరి లోకం ఒకటే,  నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసనషాలిని పాండే అవకాశం పట్టేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఆమె కెరీర్ ను టర్న్ చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: