బర్త్ డే : చిన్మయి శ్రీపాద గురించి ఈ విషయాలు తెలుసా ?

Vimalatha
చిన్మయి శ్రీపాద... ఒక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు బాగా పరిచయం. తన గొంతులో అమృతం పోసుకుందా అన్నంత మధురంగా ఉంటాయి ఆమె గళంలో నుంచి జాలువారే పాటలు. హస్కీ వాయిస్ తో మాయ చేయగలదు అలాగే తీయదనం ఉట్టిపడేలా అందర్నీ మైమరిపించే సాంగ్స్ పాడగలదు. పైగా ఇటీవల కాలంలో ఆమె లైంగిక వేధింపుల కేసు విషయమై గొంతెత్తి మాట్లాడడంతో అందరికీ మరింత చేరువైంది. ఈ రోజు చిన్మయి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సమంత టాలీవుడ్ కు "ఏ మాయ చేసావే" చిత్రంతో పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పింది చిన్మయి. అద్భుతమైన వాయిస్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చాలామంది హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. 12 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు చిన్మయి డబ్బింగ్ చెప్తూనే ఉంది.
పదిహేనేళ్ల వయసులోనే "ఏ దేవి వరము నీవో" అంటూ సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది చిన్మయి. ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమెకు వరుసగా సింగర్ గా అవకాశాలు లభించాయి. తమిళంలో స్టార్ సింగర్ రేంజ్ కి ఎదిగిపోయింది. బాలీవుడ్లో ఆమె పాడిన చెన్నై ఎక్స్ ప్రెస్ టైటిల్ సాంగ్, జహెన్ సీబ్ సాంగ్, టూ స్టేట్స్ లో మస్త్ మగన్ సాంగ్స్ హిట్టవడంతో తెలుగు ఇండస్ట్రీ ఆమెను గుర్తించడం మొదలు పెట్టింది.
తెలుగులో ఆమె పాడిన సాంగ్స్ లో "కాదలే కాదలే, మయ్య మయ్య, కిలిమంజారో, మనసా మనసా, ఇంతలో ఎన్నెన్ని వింతలో, పదహారేళ్ళైనా" అనే సాంగ్స్ ను డిఫరెంట్ వేరియేషన్స్ తో అద్భుతంగా పాడింది చిన్మయి.
చిన్మయి ఓ ట్రాన్స్ లేషన్ సర్వీస్ కంపెనీకి సీఈవో కూడా. 'బ్లూ ఎలిఫెంట్' అనే పేరుతో ఆమె ఈ కంపెనీని ఆగస్టు 2005లో స్థాపించింది.
2011లో చిన్మయి తన పేరుతో ఒక యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ అన్ని ఐఓఎస్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్రపంచంలోనే ఇలాంటి ఎక్స్ క్లూజివ్ యాప్ కలిగి ఉన్న మొట్టమొదటి మహిళా సింగర్ చిన్మయి శ్రీపాద కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: