బర్త్ డే : రాకేష్ రోషన్ గుండు వెనుక పెద్ద కథే ఉంది సుమా !

Vimalatha
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత రాకేశ్ రోషన్ ఈ రోజు తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాకేష్ కు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు మీ కోసం. "కహో నా ప్యార్ హై", "కోయిలా" వంటి అనేక పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు రాకేష్ రోషన్ 6 సెప్టెంబర్ 1979న ముంబైలో జన్మించారు. రాకేష్ రోషన్ బాలీవుడ్ లో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.
అయితే రాకేష్ రోషన్‌ ఎప్పుడూ జుట్టు లేకుండా గుండుతోనే కన్పిస్తాడు. రాకేష్ రోషన్ వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు ఊడిపోయిందని, ఏదో వ్యాధితో బట్టతల వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి రాకేష్ రోషన్ గుండుతో కన్పించడం వెనుక వేరే కథ ఉంది.
రాకేష్ రోషన్ "ఖుడ్‌గార్జ్" చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయమయ్యారు. రాకేష్ రోషన్ ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ప్రతిజ్ఞ చేయాలనుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే తిరుపతికి వచ్చి తన జుట్టును ఇస్తానని తిరుపతి బాలాజీకి మొక్కుకున్నాడు. సినిమా హిట్ కావాలని గట్టిగా కోరుకుంటూ ఇలా చేశారు.
రాకేష్ రోషన్ కోరుకున్నట్టుగానే ఆయన ఖుడ్‌గార్జ్" చిత్రం సూపర్ హిట్. సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రాకేష్ రోషన్ తన ప్రతిజ్ఞను మరచిపోయాడు. కానీ అతని భార్య పింకీ అతని ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకుంది. ఆమె తన భర్తకు ఆయన చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసింది. ఆ తర్వాత రాకేశ్ రోషన్ తిరుపతికి వెళ్లి గుండు గీయించుకున్నారు. అలా మర్చిపోయినందుకు పరిహారంగా రాకేష్ రోషన్ తన వెంట్రుకలు గీయడానికి తిరుపతికి వెళ్లినప్పుడు, అతను ఎప్పుడూ తలపై వెంట్రుకలు పెంచుకోనని మరో ప్రతిజ్ఞ చేశాడు. ఈ చిత్రం తరువాత అతను అనేక చిత్రాలకు దర్శకత్వం వహించాడు మరియు అన్నీ హిట్ అయ్యాయి. రాకేష్ రోషన్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ప్రయత్నం చేశాడు. అతను పరయ ధన్, ఆంఖోన్-ఆంఖోన్ మే, సుందర్ వంటి అనేక చిత్రాలలో నటించాడు.
ప్రస్తుతం రాకేష్ రోషన్ హృతిక్ రోషన్ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ "క్రిష్" ఫ్రాంచైజీలో నాల్గవ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటీవల ఆయన ఈ చిత్రాన్ని ప్రకటించాడు. సినిమా ప్రకటన తర్వాత అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఈ సూపర్ హీరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: