మానవతా మూర్తి మదర్ థెరిస్సా..!

MOHAN BABU
బిడ్డలు బాధపడుతూ ఉంటే తల్లి మనసు తల్లడిల్లుతోంది. వెంటనే వారిని గుండెలకు హత్తుకొని వారి బాధను దూరం చేస్తుంది. ఆ మాతృత్వ పరిమళాన్ని పంచుతుంది. తన పేగు  బంధాన్ని చాటుతుంది. కన్న బిడ్డలపై తల్లికి ఉండే  సహజ గుణం కూడా ఇదే. మరి సమాజంలో ఎన్నో ఈసడింపులకు, అవమానాలకు గురవుతున్నటువంటి శరణార్థులు, అనాధలు, నిరుపేదలు వ్యాధిగ్రస్తులను  చూడడానికి ఎవరున్నారు..? దానికి సమాధానంగా నేనున్నానంటూ  ఒక మానవతామూర్తి సమాజంలో ముందుకు వచ్చింది. వారి బాధలు తీర్చేందుకు ఆపన్నహస్తం అందించి ప్రేమానురాగాలను పంచింది. ఆమె ఎవరో కాదు  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది  గుండెల్లో  చోటు సంపాదించుకున్న ఆ తల్లి మదర్ తెరిసా.. ఆమె 111వ జయంతి నేడు..


 ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపం విశ్వమాత మదర్ తెరిసా.. సృష్టిలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. దానికి ఆకాశమే హద్దు.. ఆకాశమంత సువిశాలం.. సముద్రమంత అనంతం.. ఇటువంటి అపురూపమైన అమ్మ ప్రేమను అభాగ్యులకు పంచి అందరిచేత అమ్మగా పిలిపించుకున్న మాతృమూర్తి మదర్ తెరిసా.. దైవం ఎల్లవేళలా అన్నిచోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు. తల్లిని  మించిన దైవం లేదు అంటారు  లేదుదైవంవంనన మనకు మానవత్వాన్ని మించిన దైవం లేదని ప్రపంచానికి చాటిన ఆ తల్లి తెరిస్సా.. దేవుడిచ్చిన అమ్మ ఎక్కడో మెరిసి డోనియలో పుట్టి ఖండాలు దాటి భారతదేశానికి 17 ఏళ్ళ వయసులో సేవ భావానికి అంకితమయ్యారు. 17 సంవత్సరాల వయసులోనే సిస్టర్ తెరిసాగా పేరు మార్చబడ్డారు.  ప్రేమను నోచుకోని అభాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేసి వారికి ప్రేమను పంచారు. మనుషుల్లో మంచితనం ఉంటుంది కానీ దాని పంచుకుంటేనే అందరికీ అందుతోందని సంబోధించిన అమ్మను దైవ మాత అనడం కంటే  తల్లిగా పిలవడమే మనం ఇచ్చే సుముశిత స్థానం. నిర్బాగ్యులకు , నిరాధారులను, అన్నార్తులను చేరదీసి వారిని ఆదరించి వారి ముఖాల్లో చిరునవ్వులు పోయించిన మానవతా మూర్తి మదర్ తెరిసా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: