బర్త్ డే : కన్నడ లో ఎంట్రీ తెలుగులో పాపులారిటీ.. భళా రామజోగయ్య శాస్త్రి

Vimalatha
ఫేమస్ లిస్ట్ రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు నేడు. ఆయన ఇప్పటివరకు దాదాపు తెలుగులో 100 సినిమాలకు పైగా లిరిక్స్ అందించారు. రామజోగయ్య శాస్త్రి తనదైన శైలు రాసే ఈ లింక్స్ అన్ని పెప్పీ అండ్ కాచిగా ఉంటూ ఆకట్టుకుంటాయి. సినిమాలో సీరియస్ కూడా అద్భుతంగా లిరిక్స్ రాయగలరు. అందుకే ఆయన అనతికాలంలోనే సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రామజోగయ్య శాస్త్రి 1960 ఆగస్టు 24న ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. ఇది =గుంటూరు జిల్లా నరసరావుపేట కు దగ్గరగా ఉంటుంది. ఆయన తండ్రి సూర్యప్రకాశరావు ఒక రైతు. ఆయన తల్లి సరస్వతమ్మ ఇల్లాలు. రామజోగయ్య శాస్త్రి ఆర్ఈసీ వరంగల్ నుండి బి.టెక్ పూర్తి చేశారు. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అయినా మెటాలిక్ ఇంజనీరుగా బెంగళూరులో పని చేశారు. లిరిసిస్ట్ కావడానికి ముందు సికింద్రాబాద్లోని జిఈ ఇండియా బిజినెస్ సెంటర్ లో వర్క్ చేశారు. రామజోగయ్య శాస్త్రి కి ముందు కన్నడ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది.

కన్నడ స్టార్ రవిచంద్రన్ రామజోగయ్య శాస్త్రిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కన్నడ లోనే ఆయన ఫస్ట్ సాంగ్ కోసం లిరిక్స్ రాశారు. ఆ తర్వాత మరో ప్రముఖ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి రామజోగయ్యను ఫేమస్ డైరెక్టర్ కృష్ణవంశీ పరిచయం చేశారు. తెలుగులో ఆయన యువసేన సినిమాలో మొదటిసారి లిరిక్స్ రాశారు. అందులో రెండు పాటలు రాశారు. దానికాయన సినిమా పరిశ్రమ నుంచి మొదటి పారితోషికంగా 20000 అందుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన లిరిక్స్ రాసిన సాంగ్స్ లో ఓం నమస్తే బోలో, సదాశివా సన్యాసి సాంగ్స్ శ్రోతలను ఓ ఊపు ఊపేశాయి. 

ఆయన అనేక సినిమాల్లో కూడా కనిపించారు.. కింగ్ సినిమాలో బ్రహ్మానందం అసిస్టెంట్ గా చిన్న పాత్ర పోషించారు. "జనతా గ్యారేజ్" సినిమా లోని "ఆపిల్ బ్యూటీ", "జయహో జనతా", కాటమరాయుడు లోని "మిరా మిరా మీసం"వన్ సాంగ్స్ తో ఆయన కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల కాలంలో వచ్చిన అన్ని స్టార్ మూవీలకు ఆయన లిరిక్స్ అందించారు అనడంలో సందేహం లేదు. ఆయన టాలెంట్ కి ఎన్నో అవార్డులు కూడా వశమయ్యాయి. రామజోగయ్య శాస్త్రి ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇండియా హెరాల్డ్ తరఫు నుంచి రామజోగయ్య శాస్త్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: