అందాల 'గీతా' మాధురి గురించి ఈ విషయాలు తెలుసా?

Vimalatha
టాలీవుడ్ పాపులర్ సింగర్ గీతా మాధురి పేరు తెలియని తెలుగు వారు ఉండరు. ఒక సింగర్ అయినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫేమస్ అయింది. ఆ గొంతుతో ఎన్నో మధురమైన పాటలు అందించిన గీతామాధురి ఎంతటి కష్టతరమైన పాట అయినా అవలీలగా పాడగలరు. తన గొంతుతో నవరసాల్లో ఏ రసమైనా ఒలిగించగలదు. శాస్త్రీయ సంగీతంలో ఆమెకున్న పట్టు అద్భుతం. ఈరోజు గీతా మాధురి పుట్టినరోజు. ఈ సందర్భంగా సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. గీతా మాధురి 2008లో వచ్చిన "నచ్చావులే" సినిమాలో "నిన్నే నిన్నే కోరా" పాటతో క్రేజ్ దక్కించుకుంది. ఈ సాంగ్ విడుదలయ్యాక సినిమా ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ సాంగ్ లవర్స్ అందరి దృష్టి ఒక్కసారిగా గీతా మాధురి పై పడింది. ఈ సాంగ్ కి గీత మాధురి మొదటిసారి నంది అవార్డు అందుకుంది. మా టీవీలో ప్రసారమయ్యే సూపర్ సింగర్ షో తో మరింత ఫేమస్ అయింది.

గీతా మాధురి తన తల్లిదండ్రులు ప్రభాకర్ లక్ష్మి లకు ఒక్కగానొక్క కూతురు. తూర్పు గోదావరికి చెందిన వారి కుటుంబం అప్పట్లోనే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ప్రాథమిక విద్య అంతా హైదరాబాద్ లో జరిగింది. వనస్థలిపురం లయోలా కాలేజీలో కాలేజీ విద్య పూర్తి చేసింది. అయితే మన చిన్నప్పటి నుంచి సంగీతం పై మక్కువ ఏర్పడడంతో అప్పట్నుంచే సాధన చేయడం మొదలు పెట్టింది. నితిన్ మ్యూజిషియన్స్ అకాడమీలో కంచర్ల కోట పద్మావతి, రామాచారి వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాన్ని ఔపోసన పట్టేసింది. ఈటీవీలో ప్రసారమైన "సై సింగర్స్ చాలెంజ్"లో ఫైనల్ గా నిలిచింది. "ప్రేమలేఖ రాశా" అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ ఆమెకు "నచ్చావులే" సినిమా లోని సాంగ్ కొన్ని మంచి గుర్తింపు లభించింది. 2008లో చిరుత సినిమాలో "చమ్కా చమ్కా" పాటకు ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకుంది. ఏక్ నిరంజన్ సినిమాలో "గుండెల్లో గిటారు" పాటకు సౌత్ స్కోప్, ఇంకా నంది పురస్కారాలు కూడా ఆమె సొంతం చేసుకుంది. ఆమె పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. 

ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతకు ముందు ఆమె పలు యూట్యూబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ సినిమా హీరో నందును 2014 ఫిబ్రవరి 9న ప్రేమ వివాహం చేసుకుంది. ఇరువైపుల పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. అక్టోబర్ 9న గీతా మాధురి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు గీతమది దంపతులు దాక్షాయణి ప్రకృతి అనే పేరు పెట్టారు. తల్లయ్యాక గీతా మాధురి తన ప్రొఫెషన్ ను కొన్ని రోజులు పక్కన పెట్టింది. మరికొన్ని రోజుల్లోనే ఆమె తిరిగి సినిమా ఇండస్ట్రీలో తన గళాన్ని వినిపించనుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గీతా మాధురి కి ఇలాంటి అద్భుతమైన పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇండియా హెరాల్డ్ తరఫునుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: