మార్నింగ్ రాగా : కవికి జేజేలు..తెలంగాణ ఎట్లుంది ?

RATNA KISHORE

బంగరు తెలంగాణ
కోటి కలల తెలంగాణ
నాలుగు అక్షరాలు కాదు
నాలుగు కోట్ల ఆకాంక్షల తెలంగాణ
అంటున్నారో సామాజిక కార్యకర్త
కవిని స్మరిస్తే ఉత్తేజం
ఆచరణ విస్మరిస్తే కోపం
ఈ కోపం బాధ కొంత కాలమే
అని అనుకోలేం .. మార్పు వచ్చేంత వరకూ
అడవి పోరాడితే అందుకు అనుగుణంగా
జనారణ్యం కొట్లాడితే అప్పుడే దాశరథి లాంటి
మహోన్నత కవికి నివాళి
నివాళి అంటే అర్థం కన్నీటి తర్పణం కాదు
క్రియాశీలక కార్యాచరణ
అది నా తెలంగాణలో కోరుకుంటున్నానీ వేళ
సందర్భం : కవి దాశరథి జయంతి
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని
మోగించిన కవి
రజకార్లపై ఉద్యమ స్వరం
వినిపించిన కవి
ఆ కవి దాశరథి
ఆ కవి జయంతి నేడు
 వందనాలు చెల్లిస్తూ
రాస్తున్నానొక మార్నింగ్ రాగా ...
పోరాడి సాధించిన వీర తెలంగాణలో ఇప్పుడు కొన్ని గొంతుకలదే ఆధిపత్యం అవుతోంది. వీరుల గళం వినిపించడం లేదు.. గా యపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో అని కవితా గీతిక వినిపించిన ఆ సుస్వర ఝరి ఇవాళ లేదు ఆ కొనసాగింపు ఇ వాళ లేదు.. ఇవాళ దాశరథి అను గొప్ప కవి జయంతి.. యథావిథిగా చేసుకునే స్మరణ ఎందుకు?వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటి?
తెలంగాణ వాకిట కవిత్వం లేదు  
 కవి లేదు అని అనలేం కాని
ప్రజా గొంతుకలు అన్నీ
సామూహికంగా మూగబోతున్నాయి
రాజ్యం పంచన చేరి తమ గీతం
గానం రాయలేకపోతున్నాయి వినిపించక
స్తబ్దుగా ఉండిపోతున్నాయి
ఈ తరుణాన గొప్ప కవిత్వం లేదు
ప్రజా సమస్యలకు అండగా నిలిచే సందర్బం లేదు
ఉద్యమంలో కేసీఆర్  అందరినీ ప్రోత్సహించారు.. తన వారు అనుకున్నారు.. తన పంథాలో నడిపించేరు. కానీ ఆ ఓయూ దారులు..ఇవాళ కేసీఆర్ అంటే కోపంగా చూస్తున్నాయి. కొత్త గొంతుకలకు విలువ లేదు.. పాత గొంతుకల్లో చైతన్యం లేదు అన్నది ఇవాళ మాట అలాంటప్పుడు ఈ ఉద్యమం  ఈ యుద్ధం ఎలా? దళితలకు మీరు ఇస్తామన్న మూడెకరాలూ ఇవ్వండి తరువాత దళిత బంధు అంటూ పథకాలు తీసుకు రావచ్చు అంటూ మండి పడుతున్న ప్రజా సంఘాలకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి?కవి ని స్మరిస్తూ సామాజిక రుగ్మతలను వద్దని చెప్పడమే నిజమయిన నివాళి .. కేవలం స్మరణలో ఏముంది.. నిర్థారిత శక్తుల నిర్థారిత ఆచరణే  క్రియాశీలకం కావాలి.. నిస్తేజం అన్నది లేకుండా ఉన్న రోజున మంచి కొంచెం అయినా అది వ్యాప్తికి నోచుకుంటుంది.. కవి స్మరణలో ఇవాళ తెలంగాణ ఎట్లుంది? ఉన్నతాధికారులకు మనుగడే లేదు.. దళిత ఉన్నతాధికారులకు
గౌరవమే లేదు అన్నది ఓ వాదన.. ఇందుకు ఎన్ని ఉదాహరణలో రాజ్యంలో అహింస ఒక ధర్మం అయితే సమ న్యాయం వర్తింపు..ఓ సూత్రం అయితే మంచి పాలన సాధ్యం కానీ ఇది సాధ్యం అవుతుందా అన్నది కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాయి కొన్ని  గొంతుకలు..అవి ఉద్యమ గొంతుకలు.. అవి మార్పును నినదించే గొంతుకలు.. బంగరు తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి ..అన్నది వారి వాదన మరి! ఒక రాజును గెలిపింంచి నేలకొరిగిన ప్రాణాలకు కవి నీరాజనాలు ఇచ్చాడు.. ఆయన మాట అయినా వింటారా ? పాటిస్తామని మాట ఇస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: