జగన్ సిఎం పదవికి నిలువెత్తు నిదర్శనం ..!!
ఎక్కడ లేని వాలెంటీర్ వ్యవస్థ ను ప్రవేశపెట్టి ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి పథకం కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా నేరుగా ప్రజలకు అందేటట్లు గా చేస్తున్నారు..గ్రామాల్లోని ప్రజలు మీసేవల చుట్టూ,తిరగకుండా గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేశారు.అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలను వైఎస్ జగన్ నెరవేర్చడం మామూలు విషయం కాదని చెప్పాలి.కరోనా వచ్చి ఏడాది అవుతున్న రాష్ట్రంలో మాత్రం అభివృద్ది ఆపడం లేదు సిఎం జగన్.
పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు పలు సేవ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జననేత సుపరిపాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని, కలకాలం ఈ పాలన కొనసాగాలని కాంక్షిస్తూ అభిమానులు పూజలు నిర్వహించనున్నారు.అలాగే రక్తదాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.