హెరాల్డ్ బర్త్ డే : 29-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 29వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి  వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 అశుతోష్ ముఖర్జీ జననం  : బెంగాల్కు చెందిన శాస్త్రవేత్త గణితం సైన్స్ న్యాయశాస్త్రం లాంటి పలు రంగాల్లో నిష్ణాతులు అయిన అశుతోష్  ముఖేర్జీ  1864 జూన్ 29వ తేదీన జన్మించారు.ఈయన  సాహితీవేత్త సంఘసంస్కర్త తత్వవేత్త కూడా. బాల్యం నుంచే అశుతోష్ చదువులో మంచి ప్రతిభ కనబర్చారు. అశుతోష్ గణితంలో ప్రతిభావంతుడైన కవి కలకత్తా విశ్వవిద్యాలయంలో  9 వేల రూపాయలకు  ఆచార్యుడిగా నియమితులయ్యారు, దీంతో ఆయన 1888లో న్యాయవాద వృత్తి చేపట్టారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు అశుతోష్ ముఖర్జీ. అంతేకాకుండా కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా పని చేశారు అశుతోష్ ముఖర్జీ. కిరణ్ నేతృత్వంలో కలకత్తా విశ్వవిద్యాలయం అధునాతన సౌకర్యాలను సమకూర్చుకొని ఆదర్శంగా నిలిచింది అని చెప్పాలి.

 


 పి.సి.మహలనోబిస్ జననం : భారతీయ శాస్త్రవేత్త అనువర్తిత గణిత శాస్త్రవేత్త అయిన పీసీసీ మనోహలభిస్  1893 జూన్ 29 వ  తేన దీ జన్మించారు.భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహార్ లాల్ నెహ్రూ అయితే భారత ప్రణాళిక పదానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన గణాంక  కొలత అయిన మహలనోబిస్  డిస్టెన్స్ ద్వారా ఎంతగానో  పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఈయన  భారతదేశం మొదటి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు. 

 


రోజా రమణి బోయపాటి జననం  : యువ  కవయిత్రి కవిసంగమం రచయితలలో ఒకరు అయినా రోజారమణి బోయపాటి 1965 జూన్ 29వ తేదీన జన్మించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోజా రమణి యువ కవయిత్రిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కవిసంగమం లో ముఖ్య రచయితగా  ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రోజారమణి, ఇక రోజారమణి ప్రచురించిన ఎన్నో రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో యువ కవయిత్రిగా ఎంతగానో గుర్తింపును సంపాదించి అభిమానులను సంపాదించుకున్నారు రోజారమణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: