హెరాల్డ్ బర్త్ డే : 19-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 19వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 ఆశిష్ విద్యార్థి జననం : భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఈయన 1962 జూన్ 19వ తేదీన జన్మించారు. ఆశిష్ విద్యార్థి తన నటనకు గాను నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని అన్ని భాషల చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించారు.తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించారు ఆశిష్ విద్యార్థి. పోకిరి సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఎంతగానో ఎంత సంపాదించారు. 

 


 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి జననం : 20వ దశాబ్దంలో భాషా శాస్త్ర కోవిదులలో  ఎంతగానో పేరెన్నికగన్న వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. 1928 జూన్ 19వ తేదీన జన్మించారు. భాషాశాస్త్రానికి సమగ్రంగా అధ్యయనం చేసి ఔపాసనం  చేయగల సత్తా ఆయనలో ఉంది అని నిరూపించుకున్న వ్యక్తి  ఈయన . ద్రావిడ భాషా శాస్త్ర విజ్ఞానంతో  ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాడు. 2012 ఆగస్టు 11వ తేదీన పరమపదించారు. ఈయన తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నో పరిశోధనా గ్రంథాలు వ్యాసాలు రచించారు. 

 

 కాజల్ అగర్వాల్ జననం : ప్రముఖ భారతీయ నటి అయిన కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19వ తేదీన జన్మించారు. ఈమె  2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆ తర్వాత 2010లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రాజమౌళి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది  కాజల్ అగర్వాల్. ఇక దశాబ్దకాలంపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది, తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అంతేకాకుండా హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం విలక్షణ నటుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 లో నటిస్తుంది కాజల్ అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: