హెరాల్డ్ బర్త్ డే : 12-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 12వ తేదిన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 పాలకోడేటి శ్యామలాంబ జననం : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష కఠిన కారాగార శిక్ష అనుభవించిన యోధురాలు అయిన  పాలకోడేటి శ్యామలాంబ 1902 జూన్ 12వ తేదీన జన్మించారు. ఈమె భర్త సూర్యప్రకాశ్ రావు కూడా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏడు నెలలపాటు 1941లో వ్యక్తిగత సత్యాగ్రహం లోనూ 6నెలల పాటు జైలుకు వెళ్లి కఠిన కారాగార శిక్ష అనుభవించింది పాలకోడేటి శ్యామలాంబ. యువతలో దేశభక్తిని పెంపొందించాలని స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్ళించాలనే  సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి ఎంతో మంది యువతలో  ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. ఈమె  1953 జూన్ 18వ తేదీన మరణించారు. 

 


 ఆచ్చి  వేణుగోపాలాచార్యులు జననం : ప్రముఖ సినీ గేయ రచయిత తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ సలహామేరకు వేణుగోపాల్ గా  పేరును మార్చుకున్నారు. 1935 జూన్ 12వ తేదీన హైదరాబాద్లో జన్మించారు.ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలకు రచయిత గా వ్యవహరించి తన అద్భుతమైన పాటలను తెలుగు చిత్ర పరిశ్రమలో అందించారు. ఈయన  అందించిన ఎన్నో పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలోని మైలురాళ్లుగా నిలిచిపోయాయి. 2016 ఫిబ్రవరి 25వ తేదీన మరణించారు. 

 


 గోపీచంద్ జననం: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయిన గోపీచంద్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. గోపీచంద్ 1975 జూన్ 12వ తేదీన జన్మించారు. ఈయన  సుప్రసిద్ధ తెలుగు చిత్ర దర్శకుడు టి.కృష్ణ కుమారుడు. తొలివలపు సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గోపీచంద్ ఆ తర్వాత జయం నిజం  వర్షం లాంటి సినిమాలలో విజయవంతంగా ప్రతినాయకుడి పాత్రలు పోషించి గుర్తింపు సంపాదించారు. ఇక ఆ తర్వాత కథానాయకుడిగా మారిన గోపీచంద్ రణం యజ్ఞం శౌర్యం శంఖం లక్ష్యం లౌక్యం అనే సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు శ్రీకాంత్ సోదరి రేష్మ ను వివాహం చేసుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ కి ఒక అబ్బాయి కూడా ఉన్నారు పేరు విరాట్  కృష్ణ, మొదట చదువు పూర్తికాగానే వ్యాపారం వైపు వెళ్లాలనుకున్నాడు గోపీచంద్ అతని తండ్రి వారసత్వాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగించాలని సినిమా రంగంలోకి ప్రవేశించారు. 

 


 శారదా జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన శారదా 1945 జూన్ 12వ తేదీన జన్మించారు. దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తన నటనకు గానూ ఏకంగా మూడుసార్లు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు శారద. మొదట ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి వారి సరసన ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్ కొనసాగారు. అప్పట్లో టాలీవుడ్ సోగ్గాడు  అయిన శోభన్ బాబు శారద జోడి బెస్ట్ జోడిగా టాలీవుడ్ లో నిలిచింది . ఇక ఆ తర్వాత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సపోర్టింగ్ రోల్స్ లో నటించి తన నటనతో ఆకట్టుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: