హెరాల్డ్ బర్త్ డే : 16-04-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

ఏప్రిల్ 16వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 స్వాతి తిరునాళ్ జననం  : కేరళలోని తిరువనంతపురం మహారాజు గొప్ప భక్తుడు రచయిత అయిన స్వాతి తిరునాళ్ 1813 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. మహారాజా రామవర్మ   పుత్రుడైన స్వాతి తిరునాళ్ స్వాతి నక్షత్రంలో జన్మించినందువల్ల కుమారునికి స్వాతి తిరుణాల్ అని నామకరణం చేశారు. యువరాజు జన్మించిన నాలుగు నెలలకే  రాజ్యానికి అధిపతి గా ప్రకటించారు అతని తండ్రి. స్వాతి తిరునాళ్ సంస్కృతంలో రచించిన గొప్ప భక్తి ప్రబోధకాలు. ఇందులో తమ ఇలవేల్పు అయిన పద్మనాభ స్వామి పై చెప్పిన భక్తి మంజరి స్తోత్రం. 

 

 కందుకూరి వీరేశలింగం పంతులు జననం : గొప్ప సంఘ సంస్కర్త తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి,  సాహితీ వ్యాసంగంలో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. తెలుగు జాతి మొత్తానికి నవయుగ వైతాలికుడు వీరేశలింగం. స్త్రీవిద్యకై ఉద్యమించి ప్రచారం చెయ్యడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. అణగారిన  కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి చదువు నేర్పేవాడు. అప్పట్లో విద్యార్థులు అందరికీ ఉచితంగా చదువు చెప్పడంతో బాటు పుస్తకాలు పలకా బలపాలు కూడా కొనిచ్చి  పిల్లల విద్యాభ్యాసానికి కారకుడయ్యాడు. అప్పటి సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలను రూపు మాపడానికి ఎంతో కృషి చేశారు కందుకూరి వీరేశలింగం. ఆంధ్ర ప్రదేశ్ లో బ్రహ్మసమాజం కూడా స్థాపించారు. అంతేకాకుండా యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. 

 

 చార్లీ చాప్లిన్ జననం : ప్రపంచ ప్రఖ్యాత హాస్య కళా కారుడు చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. ఈయన ఒక మేధాయుతమైన దృశ్య మాధ్యమం అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎంతోమంది హాస్య కళాకారులు ఉన్నప్పటికీ ఈయన  మాత్రం ఒక విభిన్నమైన కళాకారుడు అనే చెప్పొచ్చు . అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి చార్లీ చాప్లిన్. అమాయకుడిగా తెరమీద కనిపించే చార్లీ చాప్లిన్ హాస్య చతురత వ్యక్తి...  నిజానికి చాలా చక్కని వాడు. ఎంతో అందగాడు కూడా. ఇది కాకుండా ఆశ్చర్యాన్ని గొలిపే  గొప్ప రచయిత చక్కని గాయకుడు చార్లీ చాప్లిన్. అన్నింటికి మించి గొప్ప ప్రపంచకారుడు.  ఒక్కమాటలో చార్లీ చాప్లిన్ గురించి చెప్పాలంటే అతను ప్రపంచ అద్భుతాలలో ఒకడు  అని చెప్పవచ్చు. ఇంగ్లాండ్కు చెందిన చార్లీ చాప్లిన్ ఆట పాట హాస్యంతో కూడిన చౌక్ ప్రదర్శనలు చేసి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. బాల్యమంతా కటిక పేదరికం లో నే గడిపిన చార్లీ చాప్లిన్ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ప్రజలందరికీ నవ్విస్తూ నవ్వుతూ కనిపించాడు. 

 

 ఎంఎస్ నారాయణ జననం : తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రేక్షకులందరికీ ఎంఎస్  నారాయణ కొసమెరుపు. హాస్య నటుడిగా తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ. ఈయన 1951 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు ఎం.ఎస్.నారాయణ. ఎమ్మెస్ నారాయణ పూర్తిపేరు మైలవరపు సూర్యనారాయణ. మొత్తంగా 700 చిత్రాలకు పైగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ముఖ్యంగా  తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరుగా నటించేవారు ఎమ్మెస్ నారాయణ. 

 

 లారా దత్త జననం  :  మాజీ విశ్వసుందరి... సినీ నటి అయిన లారా దత్త  1978 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. భారతదేశం నుంచి విశ్వసుందరిగా ఎంపిక అయిన రెండవ మహిళగా  లారా రికార్డును సృష్టించారు. ఆ తర్వాత హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు లారా  దత్త .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: