మొటిమలు ఎందుకు గిల్లకూదదో రీజన్ తెలుసా..?

Bhavannarayana Nch

శరీరంపై వచ్చే ఎటువంటి మార్పులు అయినా సరే మనం సహజంగా వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి తప్ప మనంతట మనంగా వాటిపై ఎలాంటి వత్తిడి చేసే ప్రయాత్నాలు చేయకూడదు..అలా చేస్తే అవి అనేక రకాలుగా మారిపోయి చర్మం వికృతంగా తయారవుతుంది దానికి ఒక ఉదాహరనే మొటిమలు..ఇది అందరినీ ఇబ్బంది పెట్టే విషయమే..మొటిమల భాదితులు లేని వారు అస్సలు ఉండరు..నిజానికి మనలో చాలా మందికి యుక్త వయసులో మొటిమల వస్తుంటాయి...తగ్గిపోతూ ఉంటాయి కానీ

 

 

చాలా మంది ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యని ఎదుర్కుంటూ ఉంటారు..ఈ మొటిమలు యువతీ యువకులని మరీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి..మనం ఎక్కడికైనా ఫంక్షన్ లకి వెళ్ళాలంటే తప్పకుండా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతాయి..అలాంటి సమయాలలో  ఈ మొటిమలు మరీ కొట్టొచ్చేటట్లు కనిపిస్తాయి...ఆ సమయంలో చాలా మంది చేసే పని ఏమిటంటే వెంటనే వాటిని గిల్లుతారు..అలా చేస్తే మొటిమలు పోతాయి నిజమే అప్పటికి తాత్కాలికంగా పోతాయి తప్ప శాశ్వత పరిష్కారం కాదు

 

 మొటిమలు గిల్లితే పోతాయి నిజమే కానీ దాని తరువాత కలిగే  ఇబ్బందులు మాత్రం చాలా రకాలుగా ఉంటాయి ఎన్నో సార్లు డాక్టర్లు చెప్తూనే ఉంటారు కూడా  అసలు ఎందుకు మొటిమలను గిల్లకూడదు? అనే సందేహం అందరికీ వస్తుంది కూడా అయితే  అనేది మీకొక పెద్ద సందేహం..అయితే ఇప్పుడు మీ సందేహాన్ని ఈ విషయాల ద్వారా నివృత్తి చేసుకోండి..ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే...తైల గ్రంథి పూడుకుపోవడం వలన మొటిమ ఏర్పడుతుంది. అదనపు తైలం, బ్యాక్టీరియా, మృతచర్మకణాలు, మరియు చీములతో మీ చర్మంరంధ్రం నిండినప్పుడు, అది వాపుకు దారి తీస్తుంది.

 

కొన్నిసార్లు ఈ పదార్థాలు చర్మం లోకి చొచ్చుకుని వెళ్తాయి..ఇప్పుడు మీ చర్మం బాగుంది అని మీరు అనుకుంటారు కానీ మీరు మొటిమలని నొక్కినపుడు మీ చర్మం తెరుచుకునేలా చేసి పై పైన ఉన్న వాటిని మాత్రమే  పోగోట్టగలరు కానీ లోలోపల ఉన్న క్రిముల్ని ఎలా పోగొడుతారు..? మీరు అలా నొక్కడం వలన బ్యాక్టీరియాను ఇంకా లోతుగా డెర్మీస్ లోనికి నెట్టడం జరుగుతుంది...ఈ క్రమంలో మొటిమలని సరిగ్గా నోక్కకపోతే నల్లటి మచ్చలు ఏర్పడుతాయి..ఆ మచ్చలు శాశ్వతంగా నిలిచిపోతాయి..


మొటిమలు మానుతున్నప్పుడు, మచ్చలు ఏర్పడతాయి. మీ చర్మం దెబ్బతిన్న ప్రతిసారీ, చర్మం సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతమేరకు కణజాలం దెబ్బతింటుంది. అందువల్ల, ముఖం మీద గుంటలు కూడా ఏర్పడతాయి...అయితే ఈ రకమైన గుంటలు కానీ..మచ్చలు కానీ ఏర్పడకుండా ఉండటానికి పూర్వం మన పూర్వీకులు ముఖానికి శుద్దమైన పసుపు ని గంధాన్ని రాసుకునే వారు వారానికి రెండు సార్లు నలుగు పెట్టుకునే వారు.అయితే వీలైనంత వరకూ మొటిమలని గిల్లకుండా చూసుకుని అవి వచ్చిన చోట గంధం కానీ పసుపు కానీ ముద్దలా చేసి పెడితే దానివల్ల చర్మం పాడవకుండా ఉంటుంది అంటున్నారు ప్రక్రుతి వైద్య నిపుణులు

 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: