కళ్ల చుట్టూ నలుపు చిటికెలో తగ్గే టిప్?

Purushottham Vinay
చాలా మందికి కూడా కళ్ల చుట్టూ నల్లగా ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. అందువల్ల వారి ముఖం అంత ఆకర్షణీయంగా కనిపించదు.మనలో ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య తలెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇక వాటిలో ఎండలో తిరగడం కూడా ఒకటి. ఎందుకంటే ఎండలో తిరడగడం వల్ల సూర్య కిరణాల్లో ఉండే ఆల్ట్రావైలెట్ కిరణాలు కళ్ల మీద పడడం వల్ల ఆ భాగంలో మెలనోసైట్స్ స్టిమ్యూలేట్ అయ్యి మెలనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల కళ్ల చుట్టూ నల్లగా మారిపోతుంది. అయితే ఈ సమస్య నుండి బయట పడాలంటే కళ్ల మీద నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. టోపీలు వంటి వాటిని ఖచ్చితంగా ధరించాలి.ఇంకా అలాగే కళ్ల చుట్టూ ఇన్ ప్లామేషన్ తగ్గడానికి తేనెను రాసుకోవాలి.స్వచ్చమైన తేనెను రాసి మసాజ్ చేయడం వల్ల ఆ తేనె చర్మంలోకి బాగా ఇంకుతుంది. అందువల్ల ఆ భాగంలో చర్మ కణాల్లో వచ్చిన ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. కళ్ళ చుట్టూ తేనెను రాసుకుని 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ నలుపు చాలా ఈజీగా తగ్గుతుంది.



 ఇక ఇలా తేనెను రాసుకున్న తరువాత నల్లటి సున్నితమైన బంకమట్టిని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని కళ్ల కింద రాసుకోవాలి. దీనిని  ఒక అరగంట పాటు అలాగే ఉంచిన తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా మడ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ఆ భాగానికి రక్తప్రసరణ అనేది ఎక్కువగా అవుతుంది.అందువల్ల ఆ భాగంలో నలుపు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే కళ్లను గట్టిగా మూస్తూ తెరుస్తూ ఉండాలి.ఇలా రోజుకు 20 నుండి 30 సార్లు చేయడం వల్ల కళ్లకు చక్కటి వ్యాయామం అవుతుంది. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి కళ్ల చుట్టూ నలుపు తగ్గుతుంది. ఇంకా అలాగే అవకాశం ఉన్న వారు పగటి పూట ఒక గంట పాటు పడుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి ఈజీగా తగ్గుతుంది. దీని వల్ల కూడా కళ్ల కింద నలుపు కూడా తగ్గుతుంది.ఇంకా అలాగే ఉదయం పూట క్యారెట్ జ్యూస్ ను , సాయంత్రం సమయంలో నారింజ , బత్తాయి జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ ఎ, విటమిన్ సి బాగా అందుతుంది. అందువల్ల కణాల్లో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గి నలుపు తగ్గుతుంది. ఇలా రెండు నెలల పాటు చేయడం వల్ల కళ్ల కింద ఉండే నలుపు ఈజీగా తగ్గుతుంది. ఇక కళ్ల చుట్టూ చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: