చలికాలంలో చర్మ సమస్యలు పరార్ అయ్యే టిప్?

Purushottham Vinay
ఆవ నూనె అనేది కేవలం వంటలకే కాదు చర్మ సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఆవనూనెతో చర్మాన్ని మనం ఈజీగా సంరక్షించుకోవచ్చు.చలికాలం పొడి వాతావరణం వల్ల చర్మం బాగా పొడిబారుతుంది.దాని ఫలితంగా చర్మం డల్ అవుతుంది. అందువల్ల ఈ కాలంలో ఖచ్చితంగా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. చర్మ సంరక్షణకు మనం ఆవ నూనె వినియోగించవచ్చు.ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్) చర్మానికి మంచి పోషణనిస్తుంది. నేటికీ చాలా మంది కూడా ఆవనూనెతో స్నానం చేస్తారు. ఆవనూనెలో కొవ్వు ఆమ్లాలు, చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ నూనె మన చర్మాన్ని తేమగా మారుస్తుంది. ఆవాల నూనెను ఉపయోగించడం వల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది.చర్మంని పొడిబారకుండా కాపాడుతుంది.పొడి చర్మం ఎగ్జిమా, సోరియాసిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కానీ ఆవాల నూనెను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఈజీగా తగ్గుతాయి. మస్టర్డ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉన్నాయి.అందుకే ప్రతి రోజూ కొన్ని చుక్కల ఆవాల నూనెతో చర్మాన్ని మసాజ్ చేయవచ్చు.



ఆవనూనెతో చర్మానికి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఇది చర్మానికి ఖచ్చితంగా తగిన పోషకాలను అందిస్తుంది.ఇంకా ముఖంతో పాటు, ఆవాల నూనెను శరీరంలోని మిగిలిన భాగాలపై కూడా మసాజ్ చేయవచ్చు. ఇది కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.ఇంకా అలాగే నిర్జలీకరణ కారణంగా చర్మం వేగంగా వృద్ధాప్యం చెందుతుంది. కాబట్టి చర్మ తేమను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.మస్టర్డ్ ఆయిల్ ముడతలు, ఫైన్ లైన్లను తొలగించడంలో ఖచ్చితంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవనూనెలో కాటన్ గుడ్డను ముంచి ముఖానికి అప్లై చేయవచ్చు. ఈ మస్టర్డ్ ఆయిల్ చర్మంతోపాటు జుట్టును కూడా సంరక్షిస్తుంది. మస్టర్డ్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇది నూనె జుట్టు పొడిబారడం ఇంకా చిట్లిపోవడాన్ని తొలగిస్తుంది.అలాగే ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బాగా బలపడి జుట్టు సహజ మెరుపును కాపాడుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: