జుట్టు రాలడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త?

Purushottham Vinay
చాలా మందికి వివిధ కారణాల వల్ల జుట్టు కుదుళ్లు బలహీన పడి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. దీనివల్ల పురుషుల్లో బట్టతల ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే స్త్రీలల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా విడుదల అవ్వడం, థైరాయిడ్, అండాశయాల్లో నీటిబుడగలు వంటి 3 కారణాల వల్ల స్త్రీలల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.అలాగే తలలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ల వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఇంకా అదే విధంగా పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. మనలో చాలా మంది కూడా ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 , విటమిన్ ఇ ఇంకా ఐరన్ లోపాలతో బాధపడుతూ ఉంటారు. ఈ పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతుంది. ఇంకా అలాగే స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు లేదా మోనోపాజ్ దశలో ఉన్నప్పుడు వారిలో వచ్చే హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.



ఇంకా అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వల్ల వాటి ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అదే విధంగా ఆటో ఇమ్యూనో జబ్బుల వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇక ఒత్తిడి, ఆందోళన వంటి కారణాత వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇంకా అదే విధంగా శరీరంలో కార్టిజాల్ హార్మోన్ ఎక్కువవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అలాగే శరీరంలో డీహైడ్రేషన్ కారణం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.ముఖ్యంగా తగినంత నీరు తాగకపోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు విరిగిపోతూ ఉంటుంది. అదే విధంగా రసాయనాలు కలిగిన షాంపులను వాడడం, వివిధ రకాల హెయిర్ స్టైల్స్ కోసం రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వాడడం ఇంకా హెయిర్ డైలను ఎక్కువగా వాడడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.కాబట్టి వీటిని గుర్తు పెట్టుకొని జుట్టు రాలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: