ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకొని వాటిని వాడటం వల్ల ముఖ సౌందర్యం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది.
తులసి చర్మానికి చాలా మంచిది. అలాగే ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా ఇళ్లలో తులసిని ప్రతి రోజూ పూజిస్తారు.
తులసి ఆకులు చాలా రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.మనం ముఖ సౌందర్యం కోసం శనగ పిండి,
తులసి ఆకు, తేనెను ఉపయోగించి
తులసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
తులసి అన్ని రకాల చర్మ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.ఇంకా ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే చర్మానికి మెరుపును ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌లో ఉపయోగించే తేనె సహజంగా చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. ఇంకా చర్మంపై రంధ్రాలను తొలగిస్తుంది.అలాగే తేనె చర్మాన్ని తేమగా మార్చడంలో బాగా సహాయపడుతుంది.తులసి ఫేస్ ప్యాక్‌లో వాడే శనగ పిండి చర్మంపై టానింగ్‌ను తగ్గిస్తుంది.
శనగ పిండి చర్మానికి చాలా మేలు చేస్తుంది. అందుకే చిన్న పిల్లలకు శనగ పిండితో స్నానం చేయిస్తారు.ఇంకా శనగపిండి మన చర్మాన్ని స్కిన్ అలర్జీల నుండి రక్షిస్తుంది.ఇంకా దీని వాడకం వల్ల చర్మంపై రంధ్రాలు కూడా రావు.మనకు మార్కెట్లో లభించే కెమికల్ బేస్డ్
బ్యూటీ ప్రొడక్ట్స్ వాడే బదులు
తులసి, తేనె, శెనగ పిండితో హెల్తీ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.ఇక ముందుగా
తులసి ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలో 2 చెంచాల శెనగ పిండి, 2 చెంచాల తేనె వేసి బాగా కలపాలి.
తులసి మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి.
తులసి ఫేస్ ప్యాక్‌ని ముఖానికి బాగా ఆరిపోయే దాకా అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీరు, కాటన్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక మీరు ఈ
తులసి పేస్ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు చేయవచ్చు.
తులసి పేస్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల చర్మ సౌందర్యం చాలా బాగా మెరుగుపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి.